నల్లగొండ పట్టణంలోని 25వ డివిజన్ అబ్బాసియా కాలనీలో ఉన్న మస్జిదే ఆయేషాలో అలాగే 22వ డివిజన్ మసీదులో శుక్రవారం రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ పార్టీ నిర్వహించారు. ఈ కార్యక్రమం సామరస్య వాతావరణంలో ఘనంగా జరిగింది.
ఈ ఇఫ్తార్ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ ఆమీర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సమద్, ఖయ్యూం బేగ్ కార్పొరేటర్లు పాల్గొన్నారు.
అలాగే ప్రెసిడెంట్ ఎం.ఏ. అసిఫ్, సెక్రటరీ మహమ్మద్ అజ్గర్, ట్రెజరర్ సయ్యద్ ఫయాజ్ ఉద్దీన్, మహమ్మద్ ఖలీల్, బీజేపీ నాయకుడు రాకి, ముస్లిం నాయకులు, మజీద్ కమిటీ సభ్యులు, కాలనీవాసులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రంజాన్ మాసం ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా ముస్లిం సోదరులు సామూహికంగా ఇఫ్తార్ చేశారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments