e-paper
Thursday, January 29, 2026

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్

నల్గొండ:

నల్గొండ జిల్లా కలెక్టరేట్‌లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలను ఆచరించి ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి అని పిలుపునిచ్చారు.

దేశ అభివృద్ధిలో జిల్లా ప్రజల పాత్ర కీలకమని పేర్కొంటూ, జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!