ePaper
Monday, March 16, 2026

నల్లగొండ బ్రేకింగ్: డ్రైనేజీలో బీఆర్ఎస్ ఓట్లు లభ్యం కేసులో 12 మందిపై సస్పెన్షన్ వేటు!

నల్లగొండ జిల్లా, చిట్యాల మండలం:

చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో డ్రైనేజీ కాల్వలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బిక్షపతికి పోలైన బ్యాలెట్ ఓట్లు లభ్యమయ్యిన ఘటన తీవ్ర రాజకీయ దుమారం రేపింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఆర్వోను సస్పెండ్ చేయగా, తాజాగా ఎంపీడీవో జయలక్ష్మి, స్టేజ్–2 అధికారి విజయ్ కుమార్‌తో పాటు మొత్తం 12 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

⚖️ ఘటనపై రాజకీయ నేతల ఆగ్రహం

ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన

మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ రాజ్యసభ ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు చిరుమూర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి,

ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యంపై దాడి చేసిన ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

🗳️ ఎన్నికల ప్రక్రియపై ప్రశ్నలు

డ్రైనేజీలో వందలాది బ్యాలెట్ పేపర్లు లభ్యమవడం ఎన్నికల ప్రక్రియలో తీవ్ర లోపాలను బయటపెట్టింది. ఈ ఘటనతో గ్రామ పంచాయతీ ఎన్నికల పారదర్శకతపై పెద్ద ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!