నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెర్వుగట్టు శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కూల్ డ్రింక్స్ షాప్ను ఆలయ ఈఓ మోహన్ బాబు సీజ్ చేశారు.
భక్తులు చేసిన ఫిర్యాదుల మేరకు గుట్టపై నిర్వహిస్తున్న దుకాణంలో తనిఖీలు చేపట్టగా, నిబంధనలకు విరుద్ధంగా వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
అలాగే బ్రాండెడ్ పేర్లతో ఉన్న నకిలీ వాటర్ బాటిల్స్ కూడా పెద్ద మొత్తంలో గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియజేసిన ఆలయ ఈఓ, టెండర్ నిబంధనలను ఉల్లంఘించిన దుకాణదారుడిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు.
భక్తులకు న్యాయమైన ధరలకు వస్తువులు అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments