నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ ద్వారకా నగర్ కాలనీలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి ఆలయాలకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి కృపతో పట్టణ ప్రజలందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని వారు ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా 8వ డివిజన్ అభివృద్ధి విషయంపై మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్, వృద్ధాప్య పింఛన్లు, సీసీ రోడ్లు, వీధి దీపాలు వంటి పలు పనులను మున్సిపాలిటీ నిధులతో, మంత్రి సహకారంతో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
పట్టణంలోని ఇతర వార్డులతో పోలిస్తే 8వ డివిజన్ వెనుకబడి ఉందని, ఇక్కడ అభివృద్ధి పనులు అత్యవసరమని స్థానికులు కోరారు.
అనంతరం తన్నీరు స్వాతి భూషణం గారి ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి కూడా నాయకులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో 8వ డివిజన్ కార్పొరేటర్ వజ్జ సంతోషిని, రమేష్ యాదవ్, వేముల లక్ష్మయ్య, స్వామి గౌడ్, చిన్నాల జానయ్య, జడల లింగయ్య, ఎండి జావిద్, పిల్లి రమేష్, వేముల నాగరాజు, కన్నెబోయిన వెంకన్న, మీనయ్య, తమ్మిశెట్టి జానయ్య తదితరులు పాల్గొన్నారు. కాలనీవాసులు, మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments