ePaper
Monday, March 16, 2026

రవీంద్రనగర్‌లో ఘనంగా జరిగిన అయ్యప్ప పడిపూజ మహోత్సవం

నల్గొండ పట్టణంలోని రవీంద్ర నగర్లో శ్రీ శ్రీ శ్రీ మణికంఠ స్వామి అభిషేక మహా పడిపూజ మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని గురు స్వామి గంపాటి శ్రీను ఆధ్వర్యంలో, శ్రీ శబరి గిరీష స్వచ్ఛంద సేవ పీఠంకు చెందిన మేడమ్ విశ్వ ప్రసాద్ బృందం సమన్వయంతో నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, భజన–కీర్తనలు నిర్వహించి అయ్యప్ప స్వామిని అభిష్టించి, పెద్ద ఎత్తున భక్తులకు మరియు మహిళలకు అన్నవితరణ కార్యక్రమం చేపట్టారు.

అయ్యప్ప భక్తులు పూల మాలలు, పండ్లతో అభిషేకం చేసి, అయ్యప్ప భక్తిగీతాల నడుమ మహోత్సవాన్ని మరింత వైభవంగా నిర్వహించారు.

కార్యక్రమంలో గార్లపాటి మురళి, రమ్య, స్వాతి, నగేష్, పావని, రమ్య, గార్లపాటి భారతమ్మ, అశోక్ గురుస్వామి, అలాగే అయ్యప్ప స్వాములు, హనుమాన్ స్వాములు, శివ స్వాములు పాల్గొన్నారు.

భక్తిగీతాలను కంజర శ్రీను మరియు భజనా బృందం ఆలపించారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!