నల్గొండ, ఈరోజు:
ఆమ్ ఆద్మీ పార్టీ నల్గొండ జిల్లా కన్వీనర్ డాక్టర్ అన్సారి మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ఇన్చార్జ్ ప్రియాంక కక్కర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా “జాడు చలో యాత్ర” రేపటి నుంచే ప్రారంభం కాబోతున్నట్లు తెలిపారు.
డాక్టర్ అన్సారి మాట్లాడుతూ—
ఈ యాత్ర ప్రధాన ఉద్దేశ్యం తెలంగాణలో ఆప్ పార్టీని గ్రామ స్థాయి వరకు బలోపేతం చేయడం, అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమైన పోటీ ఇవ్వడానికి సిద్ధం కావడం అన్నారు.
ఈ యాత్రలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments