ePaper
Monday, March 16, 2026

అనంతారం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని సర్పంచ్ అభ్యర్థి వజ సత్యనారాయ

అనంతారం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని సర్పంచ్ అభ్యర్థి వజ సత్యనారాయణ

నల్లగొండ మండలం అనంతారం గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి వజ సత్యనారాయణ ప్రత్యేక పూజలతో ప్రచారాన్ని ప్రారంభించారు. గ్రామంలోని దేవాలయాల్లో సంప్రదాయ విధాన ప్రకారం పూజలు నిర్వహించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహాయ సహకారాలతో అనంతారం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా రూపుదిద్దే సంకల్పాన్ని వెల్లడించారు.

గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తానని చెప్పిన వజ సత్యనారాయణ, తమకు ఆశీర్వాదాలు అందించాలని ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు పెరిక కవిత, ఆవుల కనకయ్య, నల్లబోతు యాదయ్య, జాల హనుమంతు, మేడా అంజయ్య, పెద్ద ఆవుల పార్వతమ్మ, పెరిక నాగరాజు, భూ లక్ష్మమ్మ తదితరులు పాల్గొని ప్రచారాన్ని నిర్వహించారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!