ఆమ్ ఆద్మీ పార్టీ 13వ వార్షికోత్సవం సందర్భంగా నేడు నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు డాక్టర్ S.C.K.R. అన్సారీ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు.
ఈ సందర్భంలో మాట్లాడుతూ ఆయన చెప్పినదేమిటంటే, డాక్టర్ అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో పార్టీ స్థాపించబడిన కొద్ది కాలానికే జాతీయ పార్టీగా ఎదిగిందని తెలిపారు. దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేస్తూ, విద్య, వైద్య రంగాల్లో భారీ మార్పులు తీసుకువచ్చి, ఇతర రాజకీయ పార్టీలకు సైతం కనువిప్పు కలిగించే విధంగా పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలతో పార్టీని నడుపుతూ దేశ రాజకీయాల్లో కొత్తదనాన్ని తీసుకువస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ, ఇతర రాజకీయ పార్టీలలా కులం, మతం పేరుతో ఓట్లు అడగకుండా, అభివృద్ధి ఆధారంగా ఓటు కోరే ఏకైక పార్టీ అని డాక్టర్ అన్సారీ పేర్కొన్నారు. యువత మేల్కొని కొత్త తరహా రాజకీయాలకు పునాదులు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అద్దంకి రవీందర్, కీర్తి అశోక్, బెజవాడ ప్రవీణ్, యూసఫ్, ఈశ్వర్, సైదులు, సత్తార్, ఇషాఖ్, వెంకటమ్మ, రాములమ్మ, శివ పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments