ప్రమాదకరమైన ప్లాసెంటా అక్రెటా కేసులో
తల్లి-బిడ్డ ప్రాణాలను కాపాడిన మలక్ పేట యశోదా వైద్యబృందం.
గర్భధారణలో కనిపించే అత్యంత అత్యవసర పరిస్థితుల్లో ప్లాసెంటా అక్రెటా చాలా తీవ్రమైనదని ఈ పరిస్థితిలో ప్లాసెంటా గర్భాశయం లోపలికి బలంగా అతుక్కుపోతుందని డెలివరీ సమయంలో తీవ్రమైన రక్తస్రావం జరిగి తక్షణ సహాయం అందకపోతే తల్లి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని,, ఇలాంటి సందర్భాల్లో సాధారణంగా వేగంగా సిజేరియన్ హిస్టరెక్టమీ చేస్తామని. కానీ ఈ కేసులో ఫ్రోజెన్ పెల్విస్ (కడుపులో టిబి కారణంగా ఏర్పడిన తీవ్రమైన అతుకులు) ఉండటం వల్ల శస్త్రచికిత్స సవాలుగా మారిందని మలక్పేట యశోద హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ లేపాక్షి దాసరి, తెలిపారు మంగళవారం స్థానిక మనోరమ హోటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ హై-రిస్క్ కేసులో మలక్పేట్ యశోదా ఆసుపత్రి వైద్య బృందం విజయవంతంగా సకాలంలో సరైన, అత్యంత క్లిష్టతరమైన శస్త్రచికిత్స చేసి తల్లి-బిడ్డల ప్రాణాలను కాపాడిందని తెలిపారు.
ఉర్మిళ 37 సంవత్సరాలు అనే మహిళ,34 వారాల 3 రోజులు గర్భిణి,ప్లాసెంటా ప్రీవియా, ప్లాసెంటా అక్రెటా, ప్రీ-గెస్టేషనల్ డయాబెటిస్, హైపోథైరాయిడిజం, గర్భధారణ సమయంలో హైపర్టెన్షన్ వంటి సమస్యలతో యశోదా ఆసుపత్రికి వచ్చారని తెలిపారు . అంతకు ముందు ఓసారి సిజేరియన్ జరగడం, కడుపులో గతంలో టిబి ఉన్నందువల్ల తీవ్రమైన జననావయవ ద్వారం చాలా బిర్రబిగుసుకుపోయి, కొయ్యబారిపోయి ఉందని స్కాన్ ఎమ్మారై ఎమ్మార్వో తెలిసిందన్నారు. ప్లాసెంటాను వేరు చేయలేక హిస్టరెక్టమీ చేయాల్సి వచ్చిందని అనంతరం మహిళలకు శిశువు
జన్మించాడని తెలిపారు. సకాలంలో సరైన శస్త్రచికిత్స చేసి బిడ్డను కాపాడగలిగారన్నారు.
ఉర్మిళ ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని ఆమె నడిచే స్థితిలో ఉందని బిడ్డ ఆరోగ్యంగా ఉందన్నారు. శస్త్ర చికిత్సలు విజయవంతంగా చేసిన గైనకాలజిస్ట్ డాక్టర్ దాసరి లేపాక్షి డాక్టర్ జోష్ణ డాక్టర్ అశ్వినిలను డాక్టర్ కళాధర్ డాక్టర్ కాశీనాథ్ యశోద ఆసుపత్రి డైరెక్టర్ గోరు కంటి పవన్ యూనిట్ శ్రీనివాసరెడ్డి, జనరల్ మేనేజర్ చిదుర శ్రీనివాస్ లు. తదితరులు అభినందించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments