పలు సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, కేక్ కటింగ్,
నల్లగొండ. నవంబర్ 23 చీకటి వెలుగు:

సత్యసాయి శత జయంతి ఉత్సవాలను ఆదివారం స్థానిక రాఘవేంద్ర కాలనీలోని సత్యసాయి ఆలయంలో కన్వీనర్ పున్న విశ్వేశ్వర్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఉదయం ఫుట్పాత్ ల పై నిద్రిస్తున్న బీద వారికి దుప్పట్లు పంపిణీ చేయగా మధ్యాహ్నం దుప్పలపల్లి, పానగల్ లోని లెప్రసీ కాలనీ వాసులకు, చారుమతి ఆశ్రమ బాలికలకు నారాయణ సేవ ( అన్నదానం ) నిర్వహించారు. సాయంత్రం అత్యంత అందంగా అలంకరించబడిన శ్రీ సత్య సాయి ఆధ్యాత్మిక సేవా కేంద్రం నందు కార్యక్రమములు నిర్వహించారు. వేద పఠనం తో కార్యక్రమము ప్రారంభించారు. తదుపరి భగవన్నామ సంకీర్తనలు ఆలపించారు. శ్రీ సత్య సాయి సమితి కన్వీనర్ పి విశ్వేశ్వర్ ఆహుతులకు స్వాగతం పలుకుతూ శ్రీ సత్య సాయి సేవా సమితి గురించి తెలియచేసి అందరూ స్వామి అశిష్యుల కోసం సమితి కార్యక్రమలో పాల్గొనాలని కోరారు తదుపరి జ్యోతి ప్రజ్వలన గావించారు. బాలవికాస విద్యార్థుల చే కోరారుబాబా శత జయంతి కేక్ ను కోసినారు . తరువాత డాక్టర్ శశిధర్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎకనామిక్స్ సహాయ ఆచార్యులు ( విశ్రాంత) ఆధ్యాత్మిక ప్రసంగం చేసినారు. తదుపరి బాలవికాస్ విద్యార్థుల చి సాంస్కృతిక కార్యక్రమముల తదుపరి మహా హారతి తో కార్యక్రమము ముగించారు భక్తులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments