తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగస్తుల అసోసియేషన్ (సామాజిక సేవ) భవనంలో జిల్లా ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించి, అనంతరం జిల్లా సంఘ ఎన్నికలు నిర్వహించారు.
సమావేశంలో జిల్లా అధ్యక్షులు జి. వెంకట్ రెడ్డి అధ్యక్షోపన్యాసం చేస్తూ, గతంలో మరియు ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా భవన నిర్మాణానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు.
పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం జిల్లా స్థాయిలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు.
జిల్లా ప్రధాన కార్యదర్శి జె. శ్రీశైలం సంఘం చేపట్టిన వివిధ కార్యక్రమాలపై తన నివేదికను సమర్పించారు.
తదనంతరం కోశాధికారి జి. మోహన్ రెడ్డి గతకాల ఆర్థిక లావాదేవీలపై ఆర్థిక నివేదికను అందించారు.
సభ్యులంతా నివేదికలను ఏకగ్రీవంగా ఆమోదించారు.
తరువాత రాష్ట్ర అధ్యక్షులు జి. దామోదర్ రెడ్డి మాట్లాడుతూ—
పెన్షనర్లకు రావలసిన ఐదు కరువుల భత్యం, ఈఎచ్ఎస్ కార్డుల ద్వారా క్యాష్‌లెస్ వైద్య సేవలు పొందేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాష్ట్ర సంఘం చేసిన ప్రతిపాదనలు, నివేదికలు గురించి వివరించారు. అలాగే జిల్లా సంఘ ఎన్నికలను సభ్యులు ఐకమత్యంతో, ఏకగ్రీవంగా పూర్తిచేయాలని సూచించారు.
తదుపరి భవన కమిటీ అధ్యక్షులు శ్రీ గాయం నారాయణరెడ్డి మాట్లాడుతూ, మండల శాఖల భవనాల ఏర్పాటు, నిర్మాణంలో ఎదురైన సవాళ్లు, సాధించిన విజయాలను వివరించారు.
సమావేశాన్ని అనంతరం ఎన్నికల నిర్వహణ అధికారి శ్రీ కె. మోహన్ రెడ్డికి స్వాధీనం చేశారు. వారి ఆధ్వర్యంలో సభ్యులందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకుని, కొత్త కార్యవర్గానికి ప్రమాణస్వీకారం నిర్వహించారు.
ఎన్నికైన కొత్త కార్యవర్గం:
గౌరవాధ్యక్షులు: రంగయ్య అసోసియేట్ అధ్యక్షులు: మోహన్ రావు ఉపాధ్యక్షులు: యుగేందర్ రెడ్డి, ఆంజనేయులు, కృష్ణయ్య కార్యదర్శులు: కే. నారాయణరెడ్డి, బి. లింగయ్య, ఎం.డి. హుస్సేన్ ప్రచార కార్యదర్శి: ఎం. శంకర్ రెడ్డి సంయుక్త కార్యదర్శులు: సంతోష్ రెడ్డి, యాదగిరి, వెంకట్ రెడ్డి
వివిధ మండలాల నుండి నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు, కార్యదర్శులు, వారి కార్యవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments