ePaper
Thursday, March 5, 2026

నల్గొండలో మున్సిపల్ సిబ్బందిపై అక్రమ వసూళ్ల ఆరోపణలు

నల్గొండ నగరంలోని 33వ డివిజన్ పరిధిలోని VT కాలనీలో మున్సిపల్ పారిశుధ్య సిబ్బందిపై అక్రమ వసూళ్లు, వివక్షత ఆరోపణలు వెలువడ్డాయి. రాజస్థాన్ టీ స్టాల్ సమీప ప్రాంతంలో గత కొన్ని రోజులుగా పేరుకుపోయిన చెరకు వ్యర్థాలను తొలగించాలని స్థానికులు కోరుతున్నప్పటికీ, సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తున్నారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు.

స్థానికుల ప్రకారం, చెత్తను తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది బహిరంగంగా డబ్బులు కోరుతున్నారని తెలిపారు. ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వారి ప్రాంతాలను మాత్రమే శుభ్రం చేస్తున్నారని, డబ్బులు ఇవ్వని సాధారణ ప్రజల ఇళ్ల ముందు లేదా బహిరంగ ప్రదేశాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు నిరాకరిస్తున్నారని ఆరోపించారు.

ఈ విషయంపై ప్రశ్నించిన వారిని సిబ్బంది అసభ్య పదజాలంతో దూషిస్తూ మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో చెత్త పేరుకుపోయి ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతోందని తెలిపారు.

ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి సంబంధిత సిబ్బందిపై విచారణ జరిపి అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు. అలాగే ఎలాంటి వివక్ష లేకుండా మొత్తం ప్రాంతాన్ని తక్షణమే శుభ్రం చేయించాలని విజ్ఞప్తి చేశారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!