నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందుటి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ముట్టడి కార్యక్రమం ఈరోజు నిర్వహించబడింది.
తెలంగాణ రాష్ట్ర జేఏసీ చైర్మన్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు మరియు రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణ అన్న పిలుపు మేరకు, “42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలి – చట్టబద్ధత కల్పించాలి” అనే నినాదంతో ఈ కార్యక్రమం చేపట్టారు.
ప్రభుత్వం హామీ ఇచ్చినా అమలు చేయలేదని విమర్శలు: దుడుకు లక్ష్మీనారాయణ
ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ:
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, ఇప్పటివరకు స్థానిక సంస్థల రిజర్వేషన్ విషయంలో పదూ చర్చించలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి 56 సార్లు ఢిల్లీకి వెళ్ళినా, ఒక్కసారి కూడా ప్రధాని తో ఈ అంశంపై చర్చించలేదని మండిపడ్డారు.
అయన పేర్కొంటూ…
అమలుకు సంబంధించి స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రానికి పూర్తి అధికారం ఉందిగానీ (ఆర్టికల్ 243D(6)) విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లకు మాత్రం కేంద్రం పార్లమెంట్‌లో బిల్లు పెట్టి 9వ షెడ్యూల్‌లో చేర్చితేనే చట్టబద్ధత వస్తుంది అని వివరించారు. ₹ 3,500 కోట్లు సాకు చూపుతూ ఎన్నికలను వాయిదా వేయడం తీవ్ర అన్యాయం, చట్టబద్ధత కల్పించేంతవరకు ఎన్నికలకు వెళ్లకూడదని జిల్లా బీసీ సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేశారు.
ధర్నా అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నేతలు:
జిల్లా జేఏసీ చైర్మన్ నర్సా ప్రసన్న రాష్ట్ర కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ జిల్లా కోశాధికారి రమేష్ గౌడ్ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అయిత గోని జనార్ధన్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కట్ట హరిబాబు వెంకన్న యాదవ్, బీపేందర్, మచ్చ నాగరాజు యాదవ్ తిరుపతయ్య గౌడ్, పుట్ట వెంకన్న గౌడ్, కర్నాటి యాదగిరి, అజయ్, గడ్డం శంకరయ్య, భరద్వాజ్, మల్లబోయిన సతీష్ యాదవ్, చిలుకరా సతీష్, చిలక రాజు చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments