ePaper
Monday, March 16, 2026

చెంచు ప్రజల సమస్యల పరిష్కారానికి చెంచుల చెంతకే జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

📍 నల్గొండ జిల్లా – నెల్లికల్ చెంచు వాని తండా

జిల్లా ప్రజావాణి కార్యక్రమంలో చెంచు మహిళ ఆదెమ్మ సమర్పించిన పిటీషన్‌కు సత్వర స్పందించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, స్వయంగా చెంచు తండాకు చేరుకొని ప్రజల సమస్యల్ని ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.

🔹 శుక్రవారం ఉదయం 8 గంటలకు

జిల్లా అధికారులు, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డితో కలిసి తాండాను సందర్శించారు. జిల్లా కలెక్టర్ తమ వద్దకే వచ్చారని చెంచు ప్రజలు ఆనందంగా స్వాగతం పలికారు.

⭐ ముఖ్యంగా వినిపించిన సమస్యలు

ఆధార్ కార్డులు లేకపోవడం / అప్డేషన్ లేకపోవడం తాగునీటి బోరు మరమ్మతు 6 కేజీల బదులు 32 కేజీల బియ్యం (అంత్యోదయ పథకం) పెండింగ్ రేషన్ కార్డులు ఉపాధి హామీ జాబ్ కార్డుల లేమి స్థానికులనే ఆశా, అంగన్వాడి, ఏఎన్ఎంలుగా నియమించాలి నెట్‌వర్క్ సదుపాయం లేకపోవడం

🛑 సమస్యలపై కలెక్టర్ స్పందన

ప్రతి ఒక్కరు ఆధార్ & ఇతర ధ్రువపత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలి పెన్షన్లు మూడు నెలలకు పైగా తీసుకోని విధంగా చూడాలి భూమి సాగులను వదిలిపెట్టకుండా కొనసాగించాలని సూచించారు కొత్తగా అటవీ భూమిని సాగు చేయరాదని సూచన ప్రభుత్వ అన్ని పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపు ఖాళీ ఉన్న స్థానిక నియామకాలు త్వరలో భర్తీ చేస్తామన్నారు ఎయిర్టెల్ / బిఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ తక్షణం ఏర్పాటు గ్రామపంచాయతీ భవనం, అంగన్వాడి & ఇతర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి చర్యలు


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!