నాల్గొండ:
కేంద్ర జాతీయ వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ ప్రహ్లాద్ జోషి గారు నాల్గొండ పట్టణాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా చొక్కల్ల చరణ్ గారు జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న రేషన్ పంపిణీ లోపాలు మరియు వినియోగదారులకు కలుగుతున్న సమస్యలను మంత్రివర్యులకు వివరించారు. ప్రజలకు సమయానికి, సక్రమంగా రేషన్ సరఫరా జరగకపోవడం, అలాగే పంపిణీ విధానంలో మార్పుల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
మంత్రివర్యులు ఈ అంశాలను శ్రద్ధగా విని, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments