జిల్లా బీసీ జేఏసీ కమిటీ ఎన్నిక సమావేశం జిల్లా బీసీ జేఏసీ కార్యాలయంలో బుధవారం బీసీ జేఏసీ చైర్మన్ మునాసు ప్రసన్నకుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ కుల సంఘాల అధ్యక్షులు, బీసీ సంఘాల అధ్యక్షులు పాల్గొని నల్గొండ జిల్లా బీసీ యూత్ జేఏసీ చైర్మన్ గా కట్టెకోలు దీపేందర్ ని, బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్గా అయితగోని జనార్దన్ గౌడ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం బీసీ జేఏసీ కమిటీని జేఏసీ చైర్మన్ మునాసు ప్రసన్నకుమార్ నియమించారు. గౌరవ సలహాదారులుగా చీర పంకజ్ యాదవ్, గౌరవాధ్యక్షులుగా సుంకరి మల్లేష్ గౌడ్, గుంటోజు వెంకటాచారి, చిలకరాజు చెన్నయ్య, పర్వతాలు, జిల్లా వర్కింగ్ చైర్మన్గా మిర్యాల యాదగిరి, ప్రధాన కార్యదర్శిగా గజ్జి అజయ్ కుమార్ యాదవ్, కో ఆర్డినేటర్ గా చెన్నూరి భరద్వాజ యాదవ్, సంయుక్త కార్యదర్శులుగా విజయ్, ఆనంతుల నాగరాజ్ గౌడ్, కన్వీనర్లుగా పాల్వాయి రవి, కర్నాటి యాదగిరి, తలారి యాదగిరి, కో కన్వీనర్లుగాహరి, సైదులు, వైస్ చైర్మన్ లుగా రామకృష్ణ
సతీష్, మార్గం సతీష్, పొగాకు నాగరాజు, పట్టణ అధ్యక్షులుగా పుట్ట వెంకన్న గౌడ్, ఉపాధ్యక్షులుగా చెన్నోజు రాజు, యూత్ జేఏసీ పట్టణ అధ్యక్షులుగా సతీష్ యాదవ్, మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడుగా ఖదీర్ లను నియమించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ కమిటీ సభ్యులందరు అంకితభావంతో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే పోరాటానికి తమవంతు బాధ్యతగా భావించి పాల్గొని రిజర్వేషన్ల సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా 42 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ బద్దంగా కల్పించిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లాలోని వివిధ కులసంఘాల అధ్యక్షులు, వివిధ బీసీ సంఘాల అధ్యక్షులు, పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments