పంచాయతీ ఎన్నికల విషయం లో ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం – 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి మరియు బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ నేలపట్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ లో గ్రామ పంచాయతి ఎన్నికలకు వెళ్లాలని ప్రకటించిన నిర్ణయాన్ని 42% బీసీ రిజర్వేషన్ సాధన సమితి తీవ్రంగా ఖండిస్తున్నది అన్నారు.
డిసెంబర్ నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల దృష్ట్యా, ప్రభుత్వం తక్షణం
అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిఅన్ని పార్టీల నాయకులతో కలిసి ప్రధానమంత్రితో భేటీకి అపాయింట్మెంట్ తక్షణమే పొందాలనీ,
భేటీలో 42% బీసీ రిజర్వేషన్లకు కేంద్ర ఆమోదం తీసుకురావడం 9 వ షెడ్యూల్ లొ చేర్పించడము రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన బాధ్యత.
ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే లేదా కేంద్రప్రభుత్వంసహకరించకపోతే,బీసీ రిజర్వేషన్ల అడ్డంకులకు బీజేపీ వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలనీ.
కేంద్రం దిగి వచ్చే వరకు భారీ స్థాయిలో ప్రజా పోరాటం నిర్వహిమని.
రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లొ ఈ విషయాన్ని ప్రస్తావించచాలని,
బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీకి నిజమైన చిత్తశుద్ధి ఉంటే, వెంటనే అమలు చేయాలి, లేకపోతే, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీ వర్గాల ప్రయోజనాల పట్ల అంకితభావం లేని పార్టీగా ప్రజల ముందునిలుస్తుందిని తెలిపారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments