బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని యధావిధిగా అమలు చేయడానికి డిసెంబర్ నెలలో ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలలో రాజ్యాంగాన్ని సవరించి బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ రిజర్వేషన్లు పెంచే వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తేలేదని బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ మునాస ప్రసన్నకుమార్ అన్నారు
బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు బీసీ రిజర్వేషన్లు పెంచడానికి పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేయాలని ప్రధాన డిమాండ్ తో నేడు నలగొండ పట్టణ కేంద్రంలో క్లాక్ టవర్ వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నాలుగు దశాబ్దాలుగా బీసీల వాటా బిసి లకే రాజ్యాంగబద్ధంగా దక్కాలని రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో పోరాటాలు చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్కు అనుగుణంగా బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచుతూ జీవో నెంబర్ 9 ని విడుదల చేసిందని, ఈ జీవోను వ్యతిరేకిస్తూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కోర్టులను వేదికగా చేసుకుని అడుగడుగునా అడ్డుకుంటున్నారని, బీసీల తినే కంచంలో మన్ను పోసి నోటికాడు ముద్దను గుంజుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు
బీసీ రిజర్వేషన్లు పెంచడం ధర్మబద్ధమైనదని, ఎస్సీ ఎస్టీ అగ్ర కులాలకు కూడా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు జరిగినప్పుడు బీసీలకు మాత్రమే జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఎందుకు ఉండవని ఆయన ప్రశ్నించారు బీసీ రిజర్వేషన్లకు సాధన కోసం బీసీ జేఏసీ అష్టాంగ ఆందోళన కార్యక్రమాల పేరుతో వివిధ దశల్లో దశలవారీగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేయాలని అన్నారు అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రం లో అర్థనగ్న ప్రదర్శన చేపట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఒత్తిడి తీసుకువస్తామన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీతో భేటీ జరగాలని, ప్రధాని సమయం ఇవ్వకపోతే ప్రధాని ఇంటి ముందే సీఎం బైఠాయించాలని ఆయన కోరారు బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ మౌనంగా ఉండడం చాలా బాధాకరమని ప్రధానమంత్రి పదవిని ప్రతిపక్షాలు విమర్శించినప్పుడు బీసీ కార్డును ప్రయోగిస్తున్న ప్రధాని మోడీ బీసీ రిజర్వేషన్ల విషయంలో స్పందించకపోవడం చాలా బాధాకరమన్నారు
డిసెంబర్ 1 నుండి ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున ఈ పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు పై ప్రత్యేక చర్చ పెట్టి, రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు సామాజిక న్యాయం చేయాలని ప్రధాన డిమాండ్ వేలాది మందితో చలో ఢిల్లీ కార్యక్రమం ద్వారా పార్లమెంటును దిగ్బంధo చేస్తామని ఆయన హెచ్చరించారు బీసీ జేఏసీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో గల్లి నుండి ఢిల్లీ వరకు బిసి ఉద్యమాన్ని ఉధృతం చేసి తెలంగాణ ఉద్యమ తరహ లోని పోరాటం చేసి బీసీ రిజర్వేషన్లు సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు గండిచెరువు వెంకన్న గౌడ్బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్, రజక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చిలకరాజు చెన్నయ్య, ముదిరాజ్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు దుడ్డు క్రిష్ణ మూర్తి, బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడు పుట్ట వెంకన్న గౌడ్, బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలుదీపేందర్, చిలకరాజు సతీష్ కుమార్, బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షుడు కర్నాటి యదగిరి, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు తల్లారి యాదగిరి ,యం.ఎ ఖదీర్ చెన్నూరి భరద్వాజ,నీలకంఠం నాగరాజు,మార్గం సతీష్ కుమార్,చెన్నోజు రాజు, పి.నాగరాజు, బి ధర్మేందర్, ఆర్.బాలాజీ,పాల్వాయి రవి, , కల్లూరి సత్యనారాయణ, గజ్జి అజయ్ కుమార్ యాదవ్, అంబటి శివ, గడుగోజు విజయ్, బాతుక సతీష్ యాదవ్, అంబటి రాజశేఖర్,దుర్గ,తదితరులు…
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments