భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) నల్గొండ జిల్లా 17వ మహాసభలను నవంబర్ 20, 21 తేదీల్లో తిప్పర్తి మండల కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ తెలిపారు. నకిరేకల్‌లో మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మల్లం మహేష్ మాట్లాడుతూ—డివైఎఫ్ఐ దేశభక్తి భావాలతో, దేశ సమైక్యత–సమగ్రత కోసం 46 ఏళ్లుగా నిరంతరం పోరాటం చేస్తోందని తెలిపారు. “మా దేహం ముక్కలైనా దేశం ముక్కలు కావొద్దు” అనే నినాదంతో ఎన్నో త్యాగాలు చేసిన సంఘం ఇదని గుర్తుచేశారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగం గణనీయంగా పెరిగిందని అన్నారు. యువతను మత విద్వేషాలతో మభ్యపెట్టి, ఉద్యోగాల సమస్యపై దృష్టి మళ్లిస్తున్నారని విమర్శించారు. కేంద్రంలోని ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ మహాసభల్లో భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికలు, పోరాటాల రూపకల్పనపై విశ్లేషణాత్మక చర్చలు జరగనున్నాయని తెలిపారు. దాదాపు 400 మంది ప్రతినిధులు పాల్గొనే ఈ మహాసభలను యువత అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు చెరుకు రమేష్, అక్కనపల్లి రాము, దాసరి శంకర్, సాయి, నితిన్, సతీష్, శ్రీకాంత్, శివ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments