మిర్యాలగూడ పట్టణంలో నకిలీ బంగారంతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న ప్రధాన నిందితుడిని పోలీసు అధికారులు అరెస్ట్ చేశారు. తక్కువ ధరకే బంగారం ఇస్తామని నమ్మించి భారీగా డబ్బులు గుంజుతున్న ఈ మోసగాడిని అద్దంకి–నార్కెట్పల్లి బైపాస్ రోడ్ వద్ద ఉదయం నిర్వహించిన వాహన తనిఖీల్లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుండి రూ.5 లక్షల నగదు, సుమారు 200 గ్రాముల అచ్చుపోసిన నకిలీ బంగారపు బిల్లలు, రూ.7 లక్షల విలువైన టాటా టియాగో కారు (KA 35-P-0914), ఒక స్మార్ట్‌ఫోన్, కుండను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు Cr.No.311/2025 కింద నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, IPS గారి ఆదేశాల మేరకు మిర్యాలగూడ డిఎస్‌పి కే. రాజశేఖర్ రాజు పర్యవేక్షణలో CCS ఇన్స్పెక్టర్ ఎం. జితేందర్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బృందం మోసగాడిని పట్టుకోవడంలో సఫలమైంది. గోవిందప్ప (40), బాల్లారి జిల్లా, కర్ణాటకకు చెందిన నిందితుడు కాగా, మహేష్, లోహిత్, నాగప్ప, ప్రసన్న గంగప్ప పేరుగల మరి నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు.

జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన కారపు శ్యామ్ సుందర్ అనే వ్యక్తి నుండి నిందితులు బెదిరింపుల ద్వారా రూ.12 లక్షలు గుంజుకొని కారులో పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో కీలక పాత్ర పోషించిన అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. ఇలాంటి మోసాలకు గురైన వారు భయపడకుండా వెంటనే ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.
📞 ఫిర్యాదుల కోసం సంప్రదించవలసిన నంబర్లు: 8712670162, 8712670163
– సబ్ డివిజనల్ పోలీసు అధికారి, మిర్యాలగూడ
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments