ePaper
Monday, March 2, 2026

మేడారం హుండీ లెక్కింపు ప్రారంభం.. ఆదాయం రికార్డు స్థాయిలో వచ్చే ఛాన్స్

మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు సంబంధించిన హుండీల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఈ లెక్కింపును దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారికంగా ప్రారంభించారు.

ఈ హుండీ లెక్కింపులో దేవాదాయ శాఖ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు కలిపి సుమారు 500 మంది పాల్గొంటున్నారు. ఈసారి మొత్తం 788 హుండీలలోని కానుకలను లెక్కించనున్నారు. గత మేడారం జాతరలో 540 హుండీలు ఏర్పాటు చేయగా, వాటి ద్వారా రూ.13.25 కోట్ల ఆదాయం వచ్చిన సంగతి తెలిసిందే.

ఈసారి భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో, గత జాతరతో పోలిస్తే ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. హుండీ లెక్కింపు ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఈ ప్రక్రియ సుమారు 10 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!