మేడారం |
మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర బందోబస్తు డ్యూటీకి వెళ్లి తీవ్ర అనారోగ్యానికి గురైన హోంగార్డు వెంకట్ మృతి చెందారు. డ్యూటీ నిర్వహణ సమయంలో ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వెంకట్‌ను ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
నిరుపేద కుటుంబానికి చెందిన వెంకట్ మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కుటుంబానికి ఆయనే ఆధారమని స్థానికులు తెలిపారు. డ్యూటీ సమయంలో ఎదురైన శారీరక ఒత్తిడి కారణంగానే అనారోగ్యం తీవ్రత పెరిగిందని స్థానికులు భావిస్తున్నారు.
ఈ ఘటనపై స్పందించిన స్థానికులు, మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ శాఖ తరపున మరియు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందించి, హోంగార్డులకు భరోసా కల్పించాలని కోరుతున్నారు.
అదేవిధంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన హోంగార్డులకు తగిన పరిహారం, కుటుంబ సభ్యులకు భద్రత కల్పించేలా ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని వెంకట్ కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments