ePaper
Thursday, March 26, 2026

మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన రేవంత్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు గాయపడడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబాలకు ఆయన గాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరించాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ అధికారులతో సమన్వయం చేసి బాధితులకు అవసరమైన సహాయాన్ని అందించాలని సూచించారు.

గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని కూడా అధికారులకు ఆదేశించారు. ఈ ప్రమాదం రెండు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపింది.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!