ePaper
Wednesday, March 25, 2026

మావోయిస్టు అగ్రనేత పాపారావు లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపుర్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేత పాపారావు అలియాస్ సున్నం చంద్రయ్య 17 మంది అనుచరులతో కలిసి బీజాపుర్ ఎస్పీ ఎదుట లొంగిపోయారు.

లొంగుబాటు సమయంలో వారి వద్ద నుంచి పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

బస్తర్ ప్రాంతానికి చెందిన పాపారావుపై ప్రభుత్వం రూ.2 కోట్ల రివార్డు ప్రకటించగా, ఆయనపై 50కి పైగా కేసులు నమోదై ఉన్నట్లు సమాచారం.

ఈ లొంగుబాటుతో మావోయిస్టు కార్యకలాపాలకు పెద్ద దెబ్బ తగిలినట్లు అధికారులు తెలిపారు. మరిన్ని మావోయిస్టులు కూడా లొంగిపోవాలని పోలీసులు పిలుపునిచ్చారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!