ePaper
Monday, March 2, 2026

తినే భోజనంలో విమల్ గుట్కా.. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో విద్యార్థుల ఆగ్రహం

నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్‌లో వడ్డిస్తున్న భోజనంలో విమల్ గుట్కా ప్యాకెట్, చెత్త కనిపించిందని ఆరోపిస్తూ విద్యార్థులు నిరసనకు దిగారు.

అసలే సరిగా ఉడకని అన్నం, నాణ్యత లేని భోజనం అందిస్తున్నారని ఆరోపిస్తున్న విద్యార్థులు, చెత్తతో ఉన్న భోజన గిన్నెను యూనివర్సిటీ ప్రధాన గేటు బయట పెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు.

నిరసన తీవ్రత పెరగడంతో యూనివర్సిటీ అధికారులు పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులను రంగంలోకి దించారు. భోజన నాణ్యతపై చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!