నాగార్జునసాగర్ నియోజకవర్గం మాడుగులపల్లి మండలం గోపాలపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తల కుటుంబాలను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు గౌరవ శ్రీ కొండేటి మల్లయ్య పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన వీరమైన పిచ్చయ్య గారి కుటుంబానికి ₹5,000, కాసాని అశోక్ గౌడ్ కుటుంబానికి ₹10,000, చిగుర్ల సైదులు కుటుంబానికి ₹5,000 ఆర్థిక సహాయం అందించారు. మరణించిన కార్యకర్తల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చింతరెడ్డి సైదిరెడ్డి, మాజీ సర్పంచ్ బొడ్డ యాదయ్య, కనేకల్ గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు కొండేటి శంకర్, సీనియర్ నాయకులు పగిళ్ల వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ అయోధ్య లింగస్వామి, మోహన్ కడారి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
— ✍️ చీకటి వెలుగు న్యూస్, నల్గొండ

Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments