ePaper
Tuesday, March 17, 2026

నల్గొండలో ఘనంగా దావత్-ఏ-ఇఫ్తార్ కార్యక్రమం

నల్గొండ జిల్లా మతసామరస్యానికి మారుపేరుగా నిలుస్తోందని, మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకొని సోమవారం నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద ఉన్న మదీనా మసీదులో ముస్లిం మైనార్టీ సోదరులకు దావత్-ఏ-ఇఫ్తార్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మైనార్టీలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేసినట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం కూడా మైనార్టీల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదని తెలిపారు.

పట్టణంలో పేద మైనార్టీ మహిళలకు టైలరింగ్ శిక్షణతో పాటు 150 మందికి కుట్టుమిషన్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. రాబోయే మూడు సంవత్సరాల్లో నిరుపేద ముస్లింలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని, అలాగే ఔట్సోర్సింగ్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మైనార్టీలు ఏ సమస్య ఉన్నా మేయర్ లేదా తన దృష్టికి తీసుకురావాలని మంత్రి సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఆఫీజ్ ఖాన్, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.

అదేవిధంగా అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, గుమ్ముల మోహన్ రెడ్డి, మౌలానా హఫీజ్ నిజాముద్దీన్, కార్పొరేటర్లు మరియు స్థానిక నేతలు పెద్దఎత్తున హాజరయ్యారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!