ePaper
Monday, March 2, 2026

ఓటు వజ్రాయుధం… ప్రతి ఒక్కరూ వినియోగించాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా 33వ డివిజన్‌లోని నల్లగొండ పబ్లిక్ స్కూల్‌లో రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

పోలింగ్ కేంద్రానికి చేరుకున్న మంత్రి ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం వంటిదని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు తన ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని, ఓటు ద్వారా మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని, ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారని తెలిపారు. ప్రజాస్వామ్య పండుగను విజయవంతం చేయాలని మంత్రి ఆకాంక్షించారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!