కంది ఉల్లాస్, చీకటి వెలుగు: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు రేపే పరిణామం చోటుచేసుకుంది. సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
తాజాగా మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన రాజగోపాల్ రెడ్డి, ఈ నిర్ణయం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
సీఎం ఎ. రేవంత్ రెడ్డికి స్వయంగా ఫోన్ చేసి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తాను ఎంతోకాలంగా పార్టీ కోసం కృషి చేసినప్పటికీ, తగిన గౌరవం ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ పరిణామం కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర కలకలం రేపింది. కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి బీజేపీ చేరతారా? లేక స్వతంత్రంగా ముందుకెళ్తారా? అన్న చర్చలు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఈ రాజీనామా కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బగా మారే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇదిలావుంటే, పార్టీ ముఖ్యనేతలు రాజగోపాల్ రెడ్డిని సంప్రదించి, రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని సమాచారం.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments