ePaper
Saturday, March 28, 2026

బడ్జెట్ పుస్తకాలపై జగదీష్ రెడ్డి ఫైర్

బడ్జెట్ పత్రాలపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. డిమాండ్ బుక్, అవుట్‌కమ్ బడ్జెట్ బుక్ ఒకేలా కాపీ చేసి ముద్రించారని ఆరోపించారు.

డిమాండ్ బుక్స్‌లో అవుట్‌కమ్ బడ్జెట్ వివరాలు ముద్రించబడటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. ఈ విధంగా బాధ్యత లేకుండా వ్యవహరించడం సరికాదని విమర్శించారు.

ప్రభుత్వం నిజంగా పరిపాలన చేస్తుందా లేక సర్కస్ నడుపుతోందా అన్న సందేహం కలుగుతోందని వ్యాఖ్యానించారు. సంబంధిత అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని, ఆర్థిక మంత్రి ఈ తప్పును సరిదిద్దాలని డిమాండ్ చేశారు.

అవుట్‌కమ్ బడ్జెట్, ఈ ఏడాది గ్రాంట్స్ బుక్ ఒకేలా ఉండటం వల్ల గత ఫలితాలు, ప్రస్తుత ప్రణాళికలపై ప్రభుత్వానికి స్పష్టత లేదని అన్నారు.

పవిత్రమైన అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులపై ఇలాంటి తప్పులు జరగడం అత్యంత బాధ్యతారాహిత్యమని, ఇది సాధారణ పొరపాటు కాకుండా నేరమని పేర్కొన్నారు.

ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తుతానని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!