ఇస్రో చైర్మన్ డా. వి. నారాయణన్ గగనయాన్ అన్‌క్రూడ్ మిషన్‌కు సంబంధించిన అన్ని కార్యక్రమాలు సజావుగా కొనసాగుతున్నాయని తెలిపారు.
బెంగళూరులో జరిగిన అంతర్జాతీయ “స్మార్ట్ అండ్ సస్టైనబుల్ స్పేస్ మిషన్ మేనేజ్మెంట్” కాన్ఫరెన్స్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ మిషన్‌కు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా ముందుకు సాగుతున్నాయని చెప్పారు.
మొదటి అన్‌క్రూడ్ మిషన్ కోసం అవసరమైన అన్ని సాంకేతిక, భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యే దశలో ఉన్నాయని పేర్కొన్నారు.
షెడ్యూల్‌ను తగిన సమయంలో ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు.
గగనయాన్ ప్రాజెక్ట్ ద్వారా భారత్ మానవులను అంతరిక్షంలోకి పంపే లక్ష్యంతో ముందుకు సాగుతుండగా, ఈ అన్‌క్రూడ్ మిషన్ కీలక దశగా భావిస్తున్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments