ePaper
Tuesday, March 31, 2026

శ్మశానాన్ని గ్యాస్ గోదాంగా మార్చిన దందా

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ప్రాంతంలో సంచలన ఘటన బయటపడింది. శ్మశానాన్ని గ్యాస్ గోదాంగా మార్చి అక్రమంగా సిలిండర్లు నిల్వ చేస్తున్న దందాను అధికారులు బయటపెట్టారు.

ఈ దాడిలో మొత్తం 414 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా నిల్వ చేసి బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

అధికారుల ఆకస్మిక తనిఖీల్లో ఈ అక్రమ కార్యకలాపాలు వెలుగులోకి రావడంతో ప్రాంతంలో కలకలం రేగింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో ఇలాంటి అక్రమ గ్యాస్ వ్యాపారాలపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!