ePaper
Monday, March 16, 2026

కార్తీక పౌర్ణమి సందర్బంగా దేవాలయాల్లో భక్తుల రద్దీ

పట్టణంలోని వివిధ దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయం, పచ్చల సోమేశ్వర స్వామి ఆలయం, అలాగే ఇతర శివాలయాల్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, దీపారాధనలు నిర్వహించారు.

వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు, భక్తులు స్వామివారిని దర్శించుకుని, ఆలయంలో 365 ఒత్తులతో దీపారాధన చేసి, ఆలయ కోనేటిలో దీపోత్సవం వదిలి ప్రార్థనలు చేశారు.

ఈ సందర్భంగా దేవాలయాలు భక్తి సందడితో నిండి, పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించబడ్డాయి. నల్గొండ ఉమ్మడి జిల్లా అంతటినుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!