ePaper
Monday, March 2, 2026

గుర్రంపొడు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపు దాడులు.. లంచంతో RI రెడ్ హ్యాండ్!

నల్గొండ జిల్లా గుర్రంపొడు మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. కార్యాలయాన్ని పూర్తిగా చుట్టుముట్టిన ఏసీబీ అధికారులు సిబ్బందిని అదుపులోకి తీసుకుని లోతైన విచారణ చేపట్టారు.

ఈ దాడుల్లో గుర్రంపొడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ (RI) మహమ్మద్ హకీమ్ బాధితుడి నుంచి రూ.20,000 లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండ్‌గా ఏసీబీ అధికారులకు చిక్కాడు. భూమి సంబంధిత పనులు త్వరగా పూర్తి చేయడానికి లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం.

ఘటన అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న పత్రాలు, ఫైళ్లను ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కార్యాలయ సిబ్బందిని విచారిస్తూ కీలక సమాచారం సేకరిస్తున్నారు.

ఈ ఘటనతో గుర్రంపొడు తహసీల్దార్ కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. ఏసీబీ దాడులతో స్థానికంగా కలకలం రేగింది. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!