చీకటి-వెలుగు, అక్టోబర్ 31 — వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి
హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. హెలికాప్టర్‌లో అక్కడికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేము నరేందర్ రెడ్డి ఉన్నారు.
వారిని రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు తదితర ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్య శారద, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తదితర అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు.
తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి వరంగల్–హన్మకొండ జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు బయలుదేరారు.

Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments