యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పురపాలిక సంఘం పరిధిలో పర్యావరణ హిత పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హనుమంత్ రావు ప్రారంభించారు.
పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తూ, హరిత విధానాలతో ఈ పోలింగ్ కేంద్రాన్ని రూపొందించారు. ప్రత్యేకంగా పచ్చటి తోరణాలు, సహజ అలంకరణలతో పోలింగ్ కేంద్రాన్ని పర్యావరణానికి హితంగా తీర్చిదిద్దారు.
ఈ పర్యావరణ హిత పోలింగ్ కేంద్రాన్ని చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని ఒకటో వార్డు, లింగారెడ్డిగూడెం లో ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి, ఎమ్మార్వో మీరాభాయి, మున్సిపల్ కమిషనర్ జి. వెంకట్ రామ్ రెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్, పర్యావరణ ఇంజనీర్ రేణు కుమార్ తో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణతో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా ఎంతో కీలకమని, ఇలాంటి పర్యావరణ హిత పోలింగ్ కేంద్రాలు ప్రజల్లో అవగాహన పెంచుతాయని తెలిపారు.

Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments