దేవరకొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో నేడు సీఎం రిలీఫ్ ఫండ్, షాది ముబారక్, కళ్యాణలక్ష్మి పథకాల కింద చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలునాయక్ గారు ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు స్వయంగా చెక్కులు అందించారు.

🔹 సీఎం రిలీఫ్ ఫండ్ కింద 250 మందికి ₹1,18,00,000 విలువైన చెక్కులు
🔹 షాది ముబారక్ & కళ్యాణలక్ష్మి పథకాల కింద ₹75,00,000 విలువైన చెక్కులు పంపిణీ
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలునాయక్ గారు మాట్లాడుతూ — “ప్రజా ప్రభుత్వంలో అర్హత కలిగిన ప్రతివ్యక్తికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు తప్పనిసరిగా చేరాలనే సంకల్పంతో ప్రభుత్వం కృషి చేస్తోంది” అన్నారు.
అలాగే:
ఇందిరమ్మ ఇండ్లు, సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డుల మంజూరు, విద్యా–ఆరోగ్య పథకాల సమర్థవంతమైన అమలు
— వంటి రంగాల్లో ప్రభుత్వం స్పష్టమైన దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
🔸 “ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు మరింత చురుకుగా వ్యవహరించాలి” అని సూచించారు.
ఈ కార్యక్రమంలో వివిధ మండలాల ఎంఆర్వోలు హనుమంతు శ్రీనివాస్ గౌడ్, మధుసూదన్ రెడ్డి, జయశ్రీ, హర్షద్ మహమూద్, ప్రశాంత్, మండల పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments