ePaper
Tuesday, March 17, 2026

₹1.5 లక్షల నగదు, ₹36 లక్షల విలువైన మూడు కార్లు స్వాధీనం

దేవరకొండ: తెలంగాణలో పలు జిల్లాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న మేకల దొంగతనాలపై చర్యలు చేపట్టిన పోలీసులు అంతర్రాష్ట్ర మేకల దొంగల గ్యాంగ్‌ను ఛేదించారు. ఐదుగురిని అరెస్ట్ చేయడంతో పాటు, వారి వద్ద నుంచి ₹1.5 లక్షల నగదు, ₹36 లక్షల విలువ గల మూడు కార్లు స్వాధీనం చేశారు. ఈ విషయాన్ని దేవరకొండ ఏఎస్పీ మౌనిక గురువారం చింతపల్లి పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో వెల్లడించారు.

తెల్లవారుజామున వాహనాల తనిఖీల సమయంలో చింతపల్లి పోలీసులకు స్కార్పియో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిపై అనుమానం వచ్చిందని తెలిపారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, వారు అంతర్రాష్ట్ర మేకల దొంగల గ్యాంగ్‌కు చెందినవారని స్పష్టమైంది.

అరెస్టైనవారు:

అమ్మలూరి విజయ్ (గురజాలు, ఆంధ్రప్రదేశ్) దాసరి వినోద్ కుమార్ శారద కార్తీక్ నందిని (నిడమూరు, నల్గొండ జిల్లా)

ఇంకా సంపంగి వెంకటేష్, శబరీష్ అనే ఇద్దరు పరారీలో ఉన్నారు. వీరిని త్వరలో అరెస్ట్ చేస్తామని ఏఎస్పీ తెలిపారు.

ఈ గ్యాంగ్ ఖరీదైన కార్లను ఉపయోగించి రాత్రి వేళల్లో మేకలను దొంగిలించి, వివిధ మార్కెట్లలో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. అరెస్టయిన వారిపై ఇప్పటికే 30 కేసులు నమోదు ఉన్నట్లు ఏఎస్పీ వివరించారు.

ఈ కేసు ఛేదనలో విశేష కృషి చేసిన పోలీస్ సిబ్బందిని ఏఎస్పీ మౌనిక ప్రత్యేకంగా ప్రశంసించి రివార్డులు అందజేశారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!