తెలంగాణ సాయుధపోరాట యోధుడు, తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో యాదవ ఉద్యోగుల సంఘం మరియు టీఎన్జీవో నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
జిల్లా యాదవ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు తరాల పరమేశ్ యాదవ్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నాగెళ్లి మురళి, ప్రధాన కార్యదర్శి జె. శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, దొడ్డి కొమురయ్య తెలంగాణ సాయుధ పోరాటానికి తొలి అమర వీరుడిగా నిలిచి ప్రజల్లో స్వేచ్ఛా భావం, సమానత్వం కోసం పోరాడే స్ఫూర్తిని నింపారని పేర్కొన్నారు.
1946 జూలై 4న జరిగిన ఘటనను గుర్తుచేస్తూ, ప్రజలపై జరిగిన దాడులను ఎదుర్కొంటూ కొమురయ్య ముందుండి పోరాడి వీరమరణం పొందినట్లు తెలిపారు. ఆయన త్యాగం ప్రజల్లో తిరుగుబాటు స్పూర్తిని రగిలించి తెలంగాణలో ప్రజాస్వామ్య పోరాటానికి మార్గదర్శకంగా నిలిచిందన్నారు.
దొడ్డి కొమురయ్య ఆశయాలు నేటికీ సామాజిక న్యాయం సాధనకు ప్రేరణగా ఉన్నాయని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సంజీవయ్యతో పాటు వివిధ సంఘాల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments