ePaper
Tuesday, March 17, 2026

నల్గొండ మర్రిగూడ బైపాస్ వద్ద ఫ్లైఓవర్ పనులు వెంటనే పూర్తి చేయాలి – డివైఎఫ్ఐ

ప్రజల ప్రాణాల రక్షణ కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్

నల్గొండ, నవంబర్ 13:

నల్గొండ మర్రిగూడ బైపాస్ వద్ద మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన,

ఫ్లైఓవర్ పనులు సుదీర్ఘంగా నిలిచిపోవడంతో సర్వీస్ రోడ్డు గుంతల మయం అయిపోయి, వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

జిల్లాకు చెందిన రోడ్లు-భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు స్వయంగా ఈ సమస్యను పర్యవేక్షించి, ఫ్లైఓవర్ పనులను వేగవంతం చేయాలని ఆయన కోరారు.

అలాగే గుంతలతో నిండిన సర్వీస్ రోడ్లను తక్షణమే మరమ్మతు చేయించాలని సూచించారు.

“ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం ఆటలాడకూడదు.

ఫ్లైఓవర్ పనులు పూర్తి కాకపోతే, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి భారీ ఆందోళన చేపడతాం,” అని మల్లం మహేష్ హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నల్గొండ పట్టణ అధ్యక్షుడు పాలాధి కార్తీక్, కార్యదర్శి గుండాల నరేష్, నాయకులు గంజి రాజేష్, ఆమనగంటి గోపీనాథ్, రాము తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!