ePaper
Sunday, March 22, 2026

పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: గుత్తా

నల్గొండ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) పథకం కింద 48 మంది లబ్ధిదారులకు రూ.19,00,000 విలువైన చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని పేర్కొన్నారు.

సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకు ఎంతో ఉపయోగకరమైనదని, ఈ పథకం ద్వారా అనేక కుటుంబాలకు ఆర్థిక సహాయం అందుతోందని అన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని తమ జీవితాలను మెరుగుపరుచుకోవాలని గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!