నల్లగొండ పట్టణంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవన్ (జిల్లా కోర్టు సమీపం)లో నేడు నల్లగొండ జిల్లా బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల బీసీ విభాగాల నాయకులు, విద్యార్థి నాయకులు, మేధావులు, ఎంఆర్పిఎస్, మాల మహానాడు నాయకులతో కూడిన సర్వసభ్య సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ సంయుక్త చర్యా సమితికి అనుబంధంగా నల్లగొండ జిల్లా బీసీ జేఏసీ ఏర్పాటు చేయబడింది. ఇందులో శ్రీ చక్రహరి రామరాజు గారు ఏకగ్రీవంగా జిల్లా చైర్మన్‌గా ఎన్నుకోబడ్డారు.

చక్రహరి రామరాజు గారు మాట్లాడుతూ:
బీసీలకు విద్య, ఉద్యోగం, రాజకీయ రంగాల్లో 42 శాతం చట్టబద్ధమైన వర్గీకరణ రిజర్వేషన్లు దక్కే వరకు రాష్ట్ర పిలుపు మేరకు బలమైన ఉద్యమ కార్యక్రమాలను చేపట్టుతామని తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లపై ఇచ్చిన హామీ అమలుకు రావడం లేదు.
కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో తటస్థంగా మౌనం పాటించడం బీసీలకు అన్యాయం అని పేర్కొన్నారు.
బీసీల హక్కులు పొందే వరకు గల్లీ నుండి ఢిల్లీ వరకు ఉద్యమాలు కొనసాగిస్తాము.
రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని,
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టి, 9వ షెడ్యూల్‌లో చేర్చి చట్టబద్ధం చేయాలని డిమాండ్ చేశారు.
మన హక్కులను కాలరాస్తే చూస్తూ నిశ్శబ్దంగా ఉండబోము.
రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ గారు మాట్లాడుతూ:
42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం అష్టాంగ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నామని,
ప్రతి జిల్లా జేఏసీ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ బీసీల శక్తి, ఐక్యత, స్వాభిమానాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు:
పిల్లి రామరాజు, తండు సైదులు గౌడ్, సింగం రామ్మోహన్, కేశబోయిన శంకర్ ముదిరాజ్, కంది సూర్యనారాయణ, కాసోజు విశ్వనాథం, నకరికంటి కాశయ్య గౌడ్, నేలపట్ల సత్యనారాయణ, నల్ల సోమ మల్లన్న, జెల్లా ఆదినారాయణ, వాడపల్లి సాయిబాబా, గుంటోజు గోవర్ధనాచారి, నోముల రవి, ఆరూరు వెంకటేశ్వరులు, గుంటోజు వెంకటాచారి, ఎరుకల శంకరయ్య గౌడ్, సొల్లేటి రమేష్, కాసోజు శంకరాచారి, చిక్కుళ్ళ రాములు, చాగంటి రాములు ముదిరాజ్, మిరియాల యాదగిరి, చొల్లేటి ప్రభాకర్, నల్ల మధు యాదవ్, గోలి విజయ్ కుమార్, ఓం పూరి వెంకటాచారి, జువాది ఇంద్రయ్య, పసుపులేటి సీతారాములు, రాపోలు పరమేష్, నాగులపల్లి శ్యాంసుందర్, మాధవి గౌడ్, రాజు ముదిరాజ్, సింగారం మల్లయ్య ముదిరాజ్, నాగిళ్ల దామోదర్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments