బిహార్ రాష్ట్రంలోని నలంద జిల్లాలో శీతల అష్టమి సందర్భంగా ఘోర విషాదం చోటుచేసుకుంది. శీతల మాత ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 8 మంది మహిళలు మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు.
చైత్ర మాసం చివరి మంగళవారం సందర్భంగా ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా చద్దన్నం ప్రసాదం సమర్పించేందుకు భక్తులు ఒక్కసారిగా ఎగబడడంతో గందరగోళం ఏర్పడి తొక్కిసలాట జరిగింది.
ఆలయం లోపల స్థలం తక్కువగా ఉండటం, భక్తుల అధిక రద్దీ, సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం ఈ ప్రమాదానికి కారణాలుగా భావిస్తున్నారు.
తొక్కిసలాటలో భయాందోళనకు గురైన భక్తులు బయటకు పరుగులు తీయగా, ఒకరిపై ఒకరు పడిపోవడంతో పరిస్థితి విషమించింది. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments