e-paper
Thursday, January 29, 2026

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి: బీసీ జేఏసీ

బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికలు వంటి అన్ని రంగాల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకు సంబంధించి పార్లమెంటులో బిల్లును ఆమోదించి రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్‌లో చేర్చాలని బీసీ జేఏసీ చైర్మన్ మునస ప్రసన్న కుమార్ డిమాండ్ చేశారు.

శుక్రవారం నల్లగొండలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ రాస్తారోకో కారణంగా కొంతసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ మాట్లాడుతూ:

ఈ నెల చివరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీల రిజర్వేషన్ల బిల్లును ఆమోదింపజేయాలని బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చితేనే అది చట్టపరంగా బలపడుతుందని రిజర్వేషన్ల సమస్య పరిష్కారం అయ్యే వరకు రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు.

అలాగే, బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం:

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఖిలపక్ష నేతలను వెంట తీసుకొని ఢిల్లీకి వెళ్లాలి, ప్రధాని నరేంద్ర మోదీ తో సమావేశమై బిల్లును ఆమోదింప చేయడానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

“డిమాండ్ నెరవేరకపోతే ఢిల్లీలో భారీ స్థాయిలో ఆందోళనలు చేస్తాం” అని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖంగా పాల్గొన్న వారు:

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు గండిచెరువు వెంకన్న గౌడ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్దన్ గౌడ్, ఎం.ఏ. ఖదీర్, పుట్ట వెంకన్న గౌడ్, బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షుడు కర్నాటి యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చిలుకరాజు సతీష్, మార్గం సతీష్ కుమార్, కొంపల్లి రామన్న గౌడ్, చెన్నోజు రాజు, చెన్నోజు భరద్వాజ, కల్లూరి సత్యనారాయణ గౌడ్, నీలం వెంకటమధు, అనంత నాగరాజు గౌడ్, గడగోజు విజయ్, తలారి రాంబాబు మొదలైన నాయకులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!