ePaper
Tuesday, March 24, 2026

నాంపల్లిలో బార్ ఓనర్స్ మౌన దీక్ష

హైదరాబాద్ నాంపల్లిలోని ఆబ్కారి భవన్ వద్ద రాష్ట్ర బార్ ఓనర్స్ అసోసియేషన్ మౌన దీక్ష చేపట్టింది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బార్ యజమానులు నిరసన వ్యక్తం చేశారు.

ప్రభుత్వానికి భారీ ఆదాయం అందిస్తున్నప్పటికీ తమకు న్యాయం జరగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా జీవో 145ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

వైన్ షాపుల వద్ద పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో, వాటిని నిబంధనల మేరకు నడపాలని కోరారు. లేకపోతే బార్లు మూసివేసి బెల్ట్ షాపులు నడపాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

తమ సమస్యలను ఎన్నిసార్లు ప్రభుత్వానికి తెలియజేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అందుకే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నిరసన చేపట్టినట్లు తెలిపారు.

సమస్యలు పరిష్కరించే వరకు శాంతియుతంగా మౌన దీక్ష కొనసాగిస్తామని బార్ ఓనర్స్ అసోసియేషన్ వెల్లడించింది.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!