పరాభవనామ నూతన సంవత్సర ఉగాది సందర్భంగా నల్గొండ పట్టణంలోని గాంధీ పార్క్లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, పురోహితులు నాగరాజు శర్మ చేత పంచాంగ శ్రవణం జరిపించారు. రాబోయే సంవత్సరంలో దేశం, రాష్ట్రంలో జరిగే పరిణామాలు, శుభాశుభ సూచనలు వివరించారు.
అలాగే వివిధ రాశుల వారికి సంబంధించిన రాశిఫలాలను వివరంగా వినిపించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు, సభ్యులు ఆసక్తిగా శ్రవణం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా కార్యదర్శి లక్ష్మిశెట్టి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు యమ మురళీధర్, సంఘం నాయకులు వీరెల్లి సతీష్, నాంపల్లి నరసింహ, లకుమారపు శ్రీనివాస్, యామ శ్యాం కుమార్, నల్లగొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments