ePaper
Wednesday, September 9, 2026

నాయి బ్రాహ్మణ జన సంస్థకు రూ.50 వేల ఆర్థిక సాయం

మరియాల లక్ష్మణ్ స్మారక పురస్కారం ప్రధానోత్సవంలో చెక్కు అందజేత

చీకటి వెలుగు – హైదరాబాద్:
నాయి బ్రాహ్మణ జన సంస్థ ఆధ్వర్యంలో మరియాల లక్ష్మణ్ స్మారక పురస్కారం ప్రధానోత్సవం హైదరాబాద్‌ హనుమాన్‌ టెక్డిలోని బీసీ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ జన సంస్థ ప్రధాన కార్యదర్శి, మరియాల లక్ష్మణ్‌ పెద్ద కుమార్తె గొట్టిపర్తి నవనీత, చిన్న కుమార్తె సుమలత కలిసి సంస్థకు రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు.

సంస్థ గౌరవ సలహాదారు డాక్టర్ రాపోలు సుదర్శన్, అధ్యక్షులు శ్రీధర్లకు రూ.50 వేల చెక్కును అందజేశారు.

ఈ సందర్భంగా గొట్టిపర్తి నవనీత మాట్లాడుతూ.. తమ తండ్రి మరియాల లక్ష్మణ్‌ పేరుతో స్మారక పురస్కారాన్ని ఏర్పాటు చేసి, నగదు పురస్కారం అందిస్తున్న నాయి బ్రాహ్మణ జన సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. తమ తండ్రి పేరు చిరస్థాయిగా నిలిచేలా సంస్థకు రూ.50 వేల చెక్కును అందించినట్లు చెప్పారు.

నాయి బ్రాహ్మణ జన సంస్థ ప్రతి సంవత్సరం తమ తండ్రి పేరుతో పురస్కారాన్ని కొనసాగించాలని ఆమె కోరారు. తమ తండ్రి ఎంతో కష్టపడి ఉన్నత స్థాయికి ఎదిగి, నాయి బ్రాహ్మణ సంఘం అభ్యున్నతికి ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు.

నాయి బ్రాహ్మణులకు ప్రస్తుతం అమలులో ఉన్న పలు జీవోల సాధనలో తమ తండ్రి కీలక పాత్ర పోషించారని నవనీత పేర్కొన్నారు. ఆయన సేవలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న నాయి బ్రాహ్మణులకు మరియాల లక్ష్మణ్ స్మారక పురస్కారాన్ని అందించాలని సంస్థను కోరారు.

అలాగే, భవిష్యత్‌లోనూ తమ కుటుంబం నుంచి సంస్థకు సహాయ సహకారాలు అందిస్తామని నవనీత, సుమలత తెలిపారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!