ePaper
Wednesday, September 9, 2026

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ దుర్మార్గం: కంచర్ల భూపాల్ రెడ్డి

నల్గొండ, సెప్టెంబర్ 9: తెలంగాణ శాసనసభ నుంచి కేటీఆర్, హరీష్ రావు సహా 17 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడాన్ని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.

ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు మాట్లాడకుండా అడ్డుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసిందని ఆరోపించారు. సీనియర్ నేతలను సభ నుంచి బయటకు పంపడం అప్రజాస్వామిక చర్య అని విమర్శించారు.

ప్రభుత్వం ఎన్ని అణచివేత చర్యలకు పాల్పడినా బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని భూపాల్ రెడ్డి స్పష్టం చేశారు. సస్పెన్షన్‌కు గురైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నల్గొండ నియోజకవర్గ పార్టీ శ్రేణుల తరఫున పూర్తి మద్దతు ప్రకటించారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!