ePaper
Tuesday, September 8, 2026

1104 సంఘంతోనే కార్మిక సమస్యల పరిష్కారం

చీకటి వెలుగు,నల్గొండ
విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్, కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐక్య ఉద్యమాలే మార్గమని TEE 1104 యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. సాయి బాబు అన్నారు. మంగళవారం
నల్గొండలోని రత్నా ఫంక్షన్ హాల్‌లో ప్రాంతీయ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి అధ్యక్షతన సన్మాన, అభినందన కార్యక్రమం నిర్వహించారు.
ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన సాయి బాబును, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన నిమ్మచెట్ల వెంకటయ్యను ఘనంగా సన్మానించారు.
కార్యక్రమానికి నల్గొండ సర్కిల్ ఎస్‌ఈ ఎ. శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
1104 సంఘం నిబద్ధతతో కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందని శ్రీనివాసులు కొనియాడారు.
విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని సాయి బాబు పిలుపునిచ్చారు.
TGPEJAC ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నా అనంతరం యాజమాన్యాలతో 14 సమస్యలపై చర్చించినట్లు తెలిపారు.
వేతన సవరణ కమిటీ ఏర్పాటు, ఖాళీ పోస్టుల భర్తీ, ఆర్టిజన్లకు APSEB సర్వీస్ రూల్స్ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.
15 రోజుల్లో యాజమాన్యం నుంచి సానుకూల స్పందన రాకుంటే జేఏసీ నిర్ణయం మేరకు ఉద్యమిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో యూనియన్ నాయకులు, ఉద్యోగులు, ఆర్టిజన్లు, కాంట్రాక్టు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!